Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో రెడ్‌మి నోట్ 12 సిరీస్ లాంఛ్ కానుంది. చైనాలో ఇటీవల ప్రకటించిన ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి జనవరిలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ పేర్కొన్నారు. నోట్ 11 సిరీస్‌కు కొనసాగింపుగా నోట్ 12 సిరీస్‌ను రెడ్‌మి లాంఛ్ చేస్తోంది. రెడ్‌మి నోట్ 12 సిరీసలో భాగంగా రెడ్‌మి నోట్ 12, రెడ్‌మి నోట్ 12 ప్రొ, రెడ్‌మి నోట్ ప్రొ+ స్మార్ట్‌ఫోన్‌లు లాంఛ్ కానున్నాయి. రెడ్‌మి నోట్ 12 సిరీస్‌లో అన్ని ఫోన్లు 5జీ కనెక్టివిటీతో అందుబాటులోకి రానున్నాయి. న్యూ నోట్ సిరీస్‌ను భారత్‌లో జనవరి 5న లాంఛ్ చేస్తారని ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. ఇక 12 ప్రొ+ 200 ఎంపీ మెయిన్ కెమెరాతో కస్టమర్ల ముందుకు రానుందని పేర్కొన్నారు. భారత్‌లో 200 ఎంపీ ప్రైమరీ కెమెరాతో రానున్న రెండో ఫోన్ నోట్ 12 ప్రొ+ కావడం గమనార్హం.
అంతకుముందు 200 ఎంపీ సిరీస్‌తో మొటొరొలా ఎడ్జ్ 30 అల్ట్రాను లాంఛ్ చేసింది. ఇక రెడ్‌మి నోట్ 12 ప్రొ+ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. రెడ్‌మి నోట్ 12 సిరీస్ 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది.