Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మండూస్ తుఫాన్ తమిళనాడుతో పాటు ఆంద్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడడంతో తుఫాన్ తీవ్రత తగ్గింది. ఇప్పటికే చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులకు కోసం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
ఒక వ్యక్తికి రూ. 1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వై ఎస్సార్ జిల్లాలు. దాంతో ఈ జిల్లాల్లోని తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలుస్తుంది.