Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటేశ్వర్
68వ సీనియర్ మహిళ పురుషుల బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీల్లో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు సెమి ఫైనల్ కు చేరిందని నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి మానస గణేష్ ఆదివారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్నటువంటి 68వ సీనియర్ మహిళా పురుషుల బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు హైదరాబాద్ జట్టుపై 35 13 35 13, వరంగల్ జట్టుపై 35 32 35 33 అదిలాబాద్ జట్టుపై 35 24 35 20 తేడాతో విజయం సాధించి పూల్ విన్నర్ గా సెమీఫైనల్ కు చేరింది మహిళా జట్టు సెమీఫైనల్ కు చేరడం పట్ల జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి మానస గణేష్ బాల్ బ్యాట్మెంటన్ సంఘ ఉపాధ్యక్షులు కిషోర్ కిషన్ రాజ్ కుమార్ సలహాదారులు హనుమంత్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి మల్లేష్ గౌడ్, బాల్ బ్యాట్మెంటన్ సంఘ సభ్యులు జట్టుకు అభినందనలు తెలిపారు.