Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి పేలుడు సంభవించింది. నగరంలోని పెద్ద బజార్ చౌరస్తాలో ఒక వైన్స్ వద్ద ఈ పేలుడు సంభవించింది. శంకర్ గౌడ్ అనే వ్యక్తి పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి చేతు తునా తునకలైంది. పేలుడుకు చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలం బీతావాహంగా మారింది. ఈ ఘటనకు కెమికల్ బాక్సు ఓపెన్ చేయడమే కారణమని తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. శంకర్ గౌడ్ పాత ఇనుప సామాను సేకరించి విక్రయిస్తాడని పోలీసులు తెలిపారు. అతనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్సె పుర్నేనేశ్వర్ తెలిపారు.
పేలుడుకు గల కారణాలను కెమికల్ డబ్బా అని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డ శంకర్ గౌడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఆపరేషన్ జరుగుతుందని బాగానే ఉన్నాడని రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పూర్నేశ్వర్ తెలిపారు. ఆ వ్యక్తి వద్దకు కెమికల్ బాక్స్ ఎక్కడినుండి వచ్చింది ఎక్కడైనా కొనుగోలు చేశాడా అతనికి ఈ కెమికల్ బాక్స్కు సంబంధమేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలుపుతున్నారు. ఏదేమైనాప్పటికీ ప్రమాద బారి నుండి వ్యక్తి కోరుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు చెప్పుకొస్తున్నాయి.