Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదివారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సుఖు రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా గతంలో పని చేశారు. అగ్నిహోత్రి గతంలో శాసన సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
సిమ్లాలోని రిడ్జ్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా , రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు.
ముఖేశ్ అగ్నిహోత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చుతామని, పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని, కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ అధికారం చేపట్టబోదని గతంలో అనేవారని, అయితే తాము బీజేపీ రథాన్ని ఆపామని వ్వక్తం చేశారు.