Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో ఆదివారం ఆధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం అయ్యాయి. పంజాబ్‌లోని అబోహర్ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నది. వీటిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, 4 రైఫిల్ మ్యాగజైన్‌లు, 2 పిస్టల్స్, 4 పిస్టల్ మ్యాగజైన్‌లు, కాట్రిడ్జ్‌లు ఉన్నాయి.
పంజాబ్‌లోని తారన్ తరన్‌లోని సర్హలి కలాన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడుకు ఉగ్రవాద లింకుపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతున్న సమయంలో బీఎస్‌ఎఫ్ జవాన్లకు ఫజిల్కా జిల్లాలోని ఆబోహర్ ప్రాంతంలో ఆధునిక ఆయుధాలు లభించాయి. ఆదివారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో తమ సిబ్బంది రెండు ఏకే 47 రైఫిల్స్, పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ తెలిపింది. కాట్రిడ్జ్‌లతో పాటు అసాల్ట్ రైఫిల్‌లో నాలుగు మ్యాగజైన్లు, సైడ్ ఆర్మ్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.