Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బృందం విచారిస్తోంది. న్యాయవాది సమక్షంలో కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. కవితను విచారణ చేయడానికి సీబీఐ బృందం ఆదివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇంటోని ఒక గదిలో ఐదుగురు సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్‌ను కవిత ముందు పెట్టి అమిత్ అరోరా స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేసి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. న్యాయవాదుల సంక్షంలోనే అధికారులు కవితను విచారిస్తున్నారు.
ఈ తరుణంలో విచారణపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు విచారణలే లైవ్ లో చూపిస్తున్నారని, కవిత విచారణను కూడా లైవ్‌లో చూపించాలన్నారు. బీజేపీ కావాలనే విపక్ష నేతలపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. కేంద్రం ఈడీ, సీబీఐ లతో రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. ఈ తరుణంలో కవిత సీఎం కేసీఆర్ కుమార్తె కాబట్టి కక్ష సాధింపు చర్యలకు దిగారని అందుకే జరుగుతున్న విచారణ లైవ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.