Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ పూర్తయింది. సీబీఐ అధికారులు ఆమెను ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వేశారు. లిక్కర్ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.
దీంట్లో ఎమ్మెల్సీ కవిత గతంలో వాడిన సెల్‌ఫోన్ల వివరాలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తుంది. కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ బృందం రికార్డు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత, శరత్, ఢిల్లీ ఎక్సైజ్ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు తమ సెల్‌ఫోన్లను తరచూ మార్చారని ఈడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఇప్పటికే తెలుపగా ఆ తర్వాత ఆ ఫోన్లలో కొన్నింటిని ధ్వంసం చేసినట్లు ఈ 170 ఫోన్ల విలువ రూ.1.30 కోట్ల దాకా ఉంటుందని వివరించింది.
ఈ కేసుపై విచారణ చేసిన ఈడీ ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా అక్రమంగా ఆర్జించేలా ఆప్ నేతలు లిక్కర్ పాలసీని రూపొందించారు. అందులో భాగంగానే సౌత్‌గ్రూప్ కంపెనీ నుంచి ఆప్ నేతలకు కనీసం రూ.100 కోట్ల ముడుపులు అందాయి. ఈ కంపెనీని నియంత్రిస్తున్న వారిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్, మాగుంట, మరికొందరు ఉన్నారు. మనీలాండరింగ్ కోణంలో మేము చేసిన దర్యాప్తులో ఈ విషయాలు నిర్ధారణ అయ్యాయి అని తెలిపింది.