Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దీపూర్ బైపాస్ రోడ్డుకు సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో మేక సురేష్ (38) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందినట్లు డిచ్ పల్లి ఎస్సై కచ్చకాయల గణేష్ తెలిపారు. గణేష్ బొర్గాం గ్రామంలో టైలర్ వృత్తిని చేస్తు జీవనం వెళ్ళదీస్తున్నాడు. కొడుకు శ్రీహరిచరణ్ ధర్మారం బి సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువు కుంటున్నాడు. కొడుకు వద్దకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు
నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కచ్చకాయల గణేష్ తెలిపారు.