Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ నెల 14 నుంచి తోలి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తరుణంలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధసెంచరీ పూర్తిచేశాడు. గాయం తీవ్రం కావడంతో మూడో వన్డేలో ఆడలేదు. ఇప్పటికీ గాయం ఇంకా నయం కాకపోవడంతో తొలి టెస్టుకు కూడా రోహిత్ శర్మను దూరం పెట్టారు.
గాయపడిన ఆటగాళ్ల స్థానంలో బీసీసీఐ అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను ఎంపిక చేసింది. అదనంగా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. రోహిత్ శర్మ గైర్హాజరీతో తొలి టెస్టులో టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. అయితే బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆ దేశంలో పర్యటిస్తున్నది. తొలి టెస్టు 14 నుంచి 18 వరకు, రెండో టెస్టు 22 నుంచి 26 వరకు జరగనుంది.