Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కెనడాలో మాట్రియెల్ నగరంలో కొందరు వినూత్నంగా ర్యాలీ తీశారు. వందల సంఖ్యలో పర్యావరణ యాక్టివిస్టులు చెట్లు, పక్షులు, నాలుగు కొమ్ముల జింక మాదిరిగా డ్రెస్‌లు వేసుకుని మాంట్రియల్ వీధుల్లోకి వచ్చారు. ఈ ఏడాది మాంట్రియెల్‌లో కాప్-15 జీవవైవిధ్య సదస్సు జరుగుతోంది. రెండు వారాల పాటు జరిగే ఈ సదస్సులో 193 ప్రపంచ నేతలు పాల్గొంటున్నారు. పర్యావరణ ప్రేమికులను కూడా ఈ సదస్సులోకి అనుమతించారు.
ఈ తరుణంలో యాక్టివిస్టులు వెరైటీగా నిరసన తెలియజేయాలి అనుకున్నారు. వీళ్లు ర్యాలీ తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కాప్ సదస్సుల్లో పర్యావరణాన్ని కాపాడే చర్యలు తీసుకోవడంలో దేశాధినేతలు విఫలం అయ్యారని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ర్యాలీలో పాల్గొన్నవాళ్లు మండిపడ్డారు. ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి రాకపోవడం వల్ల 10 లక్షల మొక్కలు, కీటకాలు, జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని వాళ్లు తెలిపారు. ఈ ర్యాలీని ప్రపంచవ్యాప్తంగా పౌర ఉద్యమాలు చేసే ఆవాబ్ అనే సంస్థ నిర్వహించింది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతిని మనం కాపాడుకోవాలని ఈ సంస్థ డైరెక్ట్ ఆస్కార్ సోరియా తెలిపాడు.