Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాటాల పరమైన విమాన సర్వీసుల దిగ్గజం ఎయిరిండియా భారీ సంఖ్యలో విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. తన సేవలను మరింత విస్తృతం చేసే కార్యాచరణలో భాగంగా సుమారు 500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా భావిస్తోంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది. అందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలు తక్కువ సీటింగ్ కలిగిన విమానాలు, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. దీనిపై ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.