Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణ అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల తర్వాత ఈ భేటీ ముగిసింది. సీబీఐ విచారణ తీరును కేసీఆర్‌కు కవిత వివరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయారు. కాగా సీబీఐ విచారణ తర్వాత తన ఇంటి నుంచి అధికారులు వెళ్లిపోయాక కవిత తన న్యాయవాదితో మాట్లాడారు.
అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ప్రశ్నించింది. లిక్కర్ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగగా అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది.