Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ సంస్థలోని ఉద్యోగులకు తాజాగా శుక్రవారం ఈమెయిల్ పంపి, శనివారానికి కల్లా దీనిపై స్పందించాలంటూ ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించారట. దీనిని భయటకు తెలిపారని తెల్సిన ఎలాన్ మస్క్ ఉద్యోగంలో చేరేటప్పుడు సంస్థతో కుదుర్చుకున్న నాన్ డిస్‌క్లోజర్ ఒప్పందాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే దాని పర్యావసానాల పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుందని అన్నట్లు, ట్విటర్ తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకుని, పరిహారం రాబడుతుందని మస్క్ ఈ మెయిల్‌లో రాసినట్టు సమాచారం.
అయితే సంస్థకు చెందిన కొద్దిపాటి సమాచారం బహిర్గతమైనా తనకు ఇబ్బంది లేదని మస్క్ అన్నట్లు తెలిసింది. కానీ మీడియాకూ పూర్తి వివరాలను పంపించడం మాత్రం అస్సలు సహించనని మస్క్ తేల్చి చెప్పారట. ఇటువంటి చర్యలకు తగిన ఫలితం ఎదుర్కోక తప్పదు అని మస్క్ ఈమెయిల్‌లో పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.