Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (210) తో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇషాన్ డబుల్ సెంచరీ సాధించడంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా టీమ్‌ఇండియాపై విరుచుకుపడే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్‌కు ఫిదా అయి అతడిని ప్రశంసిస్తూనే ఇకనైనా టీమ్‌ఇండియా ఆటతీరులో మార్పు రావాలని సూచించాడు.
'ఈ రోజుల్లో వన్డే క్రికెట్ ఈ విధంగా ఆడాలి.. ఇషాన్ కిషన్‌ను చూసి నేర్చుకోండి టీమ్‌ఇండియా' అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. అయితే, టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైన అనంతరం భారత జట్టుపై వాన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్లలో క్రికెట్ టీమ్‌ఇండియా అత్యంత పేలవమైన జట్టుని వ్యాఖ్యానించాడు.'2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత్ సాధించేందేమీ లేదు. పాత తరం ఆటతో పేలవమైన ప్రదర్శన చేస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్ లో అత్యంత దారుణంగా ఆడిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమ్‌ఇండియానే' అని వాన్ అప్పట్లో విమర్శించాడు.