Authorization
Fri May 16, 2025 07:45:05 pm
చటోగ్రామ్: హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా.. వేలి గాయం ఇంకా తగ్గకపోవడంతో రోహిత్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఆదివారం తెలిపింది. హిట్‌మ్యాన్ గైర్హాజరీలో రాహుల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. అతడి స్థానంలో యువ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో చోటు దక్కింది. ‘బంగ్లాతో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ రోహిత్.. తొలి టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రోహిత్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండేదీ లేనిదీ త్వరలోనే వెల్లడిస్తాం. అతడి స్థానంలో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టుకు ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.