Authorization
Fri May 16, 2025 08:17:54 pm
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేయనుంది. జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు బుక్‌చేసుకోచ్చు. అదేవిధంగా ఈ నెల 16, 31వ తేదీదీలకు సంబంధించి ప్రత్యేక రూ.300 దర్శనం టైం స్లాట్ టోకెన్లను మంగళవారం విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ టికెట్లను అందుబాటులో ఉంచనుంచి. కాగా, ఈనెల 16 సాయంత్రం నుంచి ధనుర్మాస నెల ప్రారంభమవుతుంది. దీంతో 17వ తేదీ నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది.