Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జడ్జిల నియామకంలో ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండూ కాల పరిమితికి కట్టుబడకపోవడం విచారకరమని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. జడ్జిల నియామకంపై కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో న్యాయ, సిబ్బంది మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో త్వరితగతిన జడ్జిల నియామకం కోసం మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంవోపీ)లో సవరణలు చేసే అంశాన్ని ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఏడేళ్లుగా పరిశీలిస్తున్నా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.