Authorization
Fri May 16, 2025 05:36:35 pm
హైదరాబాద్: జనవరి మాసంలో రైతుబంధు నిధులను విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ఆలేరు పట్టణ కేంద్రంలో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహావిష్కరణ చేశారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఆలేరు నియోజకవర్గంలో ఎంతో స్ఫూర్తిని చూపిస్తూ దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కురుమ కులస్తులైన రాములు సాంబశివుడు నమ్మిన ధర్మం కోసం చివరి వరకు పోరాటం చేశారని గుర్తుచేశారు.