Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈనెల 14న జరుగున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి క్యాబినెట్‌లో స్థానం కల్పిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై అధికార పార్టీ కానీ, దయానిధి కానీ స్పందించకపోవడంతో అది నిజమేనని విశ్లేషకులు అంటున్నారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తన వారసుడిని మంత్రివర్గంలోకి తీసుకుని యువజన సంక్షేమ, క్రీడా శాఖ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా మెయ్యనాథన్ శివ కొనసాగుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.