Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులో పెను ప్రమాదం తప్పింది. నర్సింగ్ విద్యార్థినులతో వెళ్తున్న కాలేజీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి సూర్యపేటకు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, విద్యార్థులంతా సూర్యాపేటలోని అపర్ణ నర్సింగ్ కాలేజీకి చెందినవారిగా తెలుస్తున్నది.