Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: డీఎంకే అధ్యక్షుడు చేపాక్- ట్రిప్లికేన్ శాసనసభ్యుడు ఉదయనిధికి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఆ దిశగా మంత్రి వర్గంలో మార్పులు చేయడానికి స్టాలిన్ కసరత్తు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా సీనియర్ మంత్రి దురైమురుగన్ సహా మంత్రులంతా ఉదయనిధిని మంత్రివర్గంలో చేర్చుకోవాలంటూ స్టాలిన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ నెలాఖరులోగా ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు స్టాలిన్ సిద్ధమైనట్లు తెలిసింది.
సచివాలయ భవన సముదాయంలో వేర్వేరు ఛాంబర్లున్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవిని చేపట్టనున్న ఉదయనిధి కోసం సచివాలయం పదో నెంబర్ ప్రవేశద్వారం సమీపంలో ఛాంబర్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇదే విధంగా రెండో అంతస్థులోని ఓ విశాలమైన గది కూడా ఉదయనిధి చాంబర్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు.