Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ఐదు చోట్ల మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా ఆ ఐదుగురు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విశ్వదార్ నియోజకవర్గం నుంచి గెలిచిన భూపత్ భయానీ అయితే, ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి నేరుగా బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
దీంతో ఈ ప్రచారంపై స్పందించిన భయానీ తాను బీజేపీలో చేరడం లేదని, కానీ అవసరమైతే బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తానని తెలిపారు. నిజానికి ఆప్ నుంచి గెలిచిన ఐదుగురిలో ముగ్గురు బీజేపీ మాజీ నేతలే కావడం విశేషం. ఈ ఐదుగురి విజయం, 13 ఓటింగ్‌తో తమ పార్టీకి జాతీయ హోదా దక్కినట్లేనని సంబర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు ఆప్‌లో కలవరం పెడుతున్నాయి.