Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యూపీలోని మొయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ సోమవారం పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ అభ్యర్ధిపై ఆమె ఘన విజయం సాధించారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డింపుల్ యాదవ్‌ను పలువురు అభినందించారు. అలాగే ఇంధన సంరక్షణ సవరణ చట్టాన్ని విద్యుత్, పునరుత్పాదక ఇంధన మంత్రి ఆర్‌కే సింగ్ నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 9న బీజేపీ ఎంపీ కిరోది లాల్ మీనా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌర స్మృతిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.