Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చేతబడి చేస్తున్నారన్న నెపంతోనే దుండగులు ఒడిశా కెందుఝర్ జిల్లాలో జంట హత్యలు జరిగింది. 45ఏళ్ల వ్యక్తిని, అతడి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దైతరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహి గ్రామంలో ఓ ఇంటి ముందు భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ మిత్రభాను తెలిపారు.
ఘటన సమయంలో తన తండ్రి బహాదా ముర్ము, తల్లి ధని(35) ఆరుబయట నిద్రిస్తున్నారని మృతుల కుమార్తె సింగో తెలిపింది. శనివారం రాత్రి నేను ఇంట్లోనే నిద్రపోయా. అర్ధరాత్రి బయటి నుంచి అరుపులు వినిపించాయి. వెళ్లి చూసేసరికి నా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారని, వెంటనే తన మేనమాన కిసాన్ మారండికి ఫోన్ చేసి పిలిచినట్లు సింగో తెలిపింది. నాకు అర్ధరాత్రి 12.30 గంటలకు సింగో నుంచి కాల్ వచ్చింది. నా పెద్ద కుమారుడిని వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చా. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దీంతో మృతదేహాలను పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం తరలించారని కిసాన్ మారండి వివరించాడు.