Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అగస్త్య జైస్వాల్ ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 16 ఏళ్లకే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. చివరి సంవత్సరం పరీక్షలను ఫస్ట్ డివిజన్ తో పూర్తి చేశాడు. భారత్ లో మాస్టర్ డిగ్రీ అందుకున్న అతి చిన్న వాడు ఇతడే. ఇక 14 ఏళ్ల వయసులో 2020లో అగస్త్య జైస్వాల్ డిగ్రీ పూర్తి చేసి భారత్ లోనే అతి చిన్న వయసులో డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డు నమోదు చేశాడు. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజమ్ లో అతడు డిగ్రీ చదివాడు. 9 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసిన రికార్డు కూడా అతడి పేరిట ఉంది. అగస్త్య ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలను కేవలం 1.72 సెకన్లలోనే టైప్ చేయగలడు. రెండు చేతులతోనూ చక్కగా రాస్తాడు. ఇతను జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ప్లేయర్. మోటివేషనల్ స్పీకర్.