Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మూత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒకటి. తాజాగా ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు దాడులు చేశారు. సోమవారం ఉదయం నుండి సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఐటి అధికారులు ఏకకాలంలో 15చోట్ల రైడ్స్ చేపట్టారు. కాగా.. మైత్రీ సంస్థ యజమానులు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలోనూ ఐటి అధికారులు సోదాలు చెపట్టారు.
మైత్రీ బ్యానర్‌లో వస్తున్న 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి' సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపుల పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. 'శ్రీమంతుడు' సినిమాతో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన మైత్రీ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' వంటి హ్యట్రిక్ హిట్లతో టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా చోటు సంపాదించుకుంది. గతేడాది 'పుష్ప'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో నాలుగు సినిమాలు రూపొందుతున్నాయి.