Authorization
Fri May 16, 2025 07:55:11 pm
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడం ఇది వరుసగా ఇది రెండోసారి కావడంయ విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
గాంధీనగర్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగగా భూపేంద్ర చేత గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ రత్ ప్రమాణం చేయించారు. ఇదే సమయంలో 16 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నవారే. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమానికి 200 మంది సాధువులు కూడా హాజరయ్యారు.