Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని కన్కేర్‌లో విషాద సంఘటన జరిగింది. కిడ్నాప్‌కు గురి అయినట్టు భావించిన నలుగురు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారు బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జలసమాధి అయ్యారు. బంధువుల పెండ్లికి వెళ్లి, తిరిగి వస్తుండగా వాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. కారుని అదుపు చేసే క్రమంలో టైరు పేలడంతో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు చనిపోయారు. బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ పత్తిలింగం వెల్లడించారు. మృతులను నబరంగ్‌పూర్ జిల్లాలోని ఉమెర్‌కోట్ వాస్తవ్యులుగా గుర్తించారు. ఉమెర్‌కోటె గ్రామానికి చెందిన సపన్ సర్కార్, అతని భార్య రీతా సర్కార్, బిస్వజిత్ అధికారి, హజరీ ధాలీలు శనివారం కారులో బంధువుల పెండ్లికి వెళ్లారు. వాళ్లు అప్పటినుంచి ఇంటికి తిరిగి రాలేదు. దాంతో, వాళ్లను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమోననే అనుమానంతో కుటుంబసభ్యులు కన్కేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వాళ్ల ఫోన్‌ను ట్రాక్ చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా వ్యవసాయ బావిలోంచి వాళ్ల మృతదేహాలను, కారును బయటకు తీశారు.