Authorization
Fri May 16, 2025 03:47:18 pm
హైదరాబాద్ : నగరంలో 8.5 కిలోల సూడో ఎఫిడ్రిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 9 కోట్లు ఉంటుందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. లుంగీలు, ఫాన్సీ ఐటమ్స్ బాక్సుల్లో పార్సల్ చేసి చెన్నై నుంచి హైదరాబాద్, పూణే మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు ఈ డ్రగ్‌ను పంపిస్తున్నారని చెప్పారు. మహమ్మద్ ఖాసీం, రసులుద్దీన్ నుంచి ఈ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నామని, వారి వద్ద ఫేక్ ఐడీకార్డులు, ఆధార్‌కార్డులను గుర్తించామన్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియాలో డ్రగ్స్ తయారీ ప్రాంతం, నిల్వ ఉంచే ప్రాంతం, తరలించే ప్రాంతం మూడూ కీలకమని, అయితే హైదరాబాద్ కేవలం డ్రగ్స్ ట్రాన్సిట్ ఏరియా మాత్రమేనని చెప్పారు.
దోతీల కోసం వాడే కాటన్ బాక్స్‌లో ఎపిడ్రిన్‌ను పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో బాక్స్‌లో 80 నుంచి 90 గ్రాముల ప్యాకెట్ పెడుతున్నారు. ఇలా 7 సార్లు పూణే నుంచి, 8సార్లు హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇప్పటి వరకు 75 కిలోల డ్రగ్ దేశం దాటించారు. అని సీపీ తెలిపారు.