Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పవిత్ర లోకేశ్ వ్యవహారంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పలు యూట్యూబ్ చానళ్లు, కొందరు వ్యక్తులపై హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సైబర్ క్రైమ్ పోలీసులు ఆదేశాలు ఇచ్చింది. నరేశ్ పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు 12 మందికి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశంలో గతంలో పవిత్ర లోకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు వెబ్ సైట్, యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు నరేశ్ పిటిషన్ తో మరోసారి నోటీసులు జారీ చేశారు.
ఈ అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్ స్పందిస్తూ, మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించారు. తమకు అందిన ఫిర్యాదుతో గతంలో విచారణ జరిపామని తెలిపారు. 11 యూట్యూబ్ చానళ్ల వివరాలు ఇవ్వాలని యూట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశామని పేర్కొన్నారు. యూట్యూబ్ నుంచి ఇంకా సమాచారం రాలేదని అన్నారు.