Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న 'జైలర్' మూవీ కోసం తలైవ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజు సంధర్భంగా 'జైలర్' నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామన్నారు. అన్నట్లుగానే . సాయంత్రం 'ముత్తువేల్ పాండియన్' వచ్చేశాడు అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. 'జైలర్' నుంచి రజినీకాంత్ లుక్ ఇప్పటికే బయటకి వచ్చినా అవి ఫోటోషూట్ నుంచి రిలీజ్ చేసినవి కాబట్టి ఫాన్స్ కి అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. ఈసారి బర్త్ డే గిఫ్ట్ గా రజినీకాంత్ జైలర్ లుక్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేస్తారేమోనని అండరూ అనుకున్నారు. కానీ.. వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.