Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ లొకేషన్‌లతో దొంగలను ఈజీగా పట్టేస్తున్నారు. అయినా దొంగలు మాత్రం దోపిడీలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. గత అర్ధరాత్రి హర్యానాలోని రేవారి పట్టణంలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. కేవలం 8 నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రేవారీలోని నాలుగు పెట్రోల్ పంపులను నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా లూటీ చేసింది. నాలుగు పెట్రోల్ పంపుల్లో కలిపి రూ.1.05 లక్షలను ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది.