Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి మంత్రి పదవి స్వీకరించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఉదయనిధి డీఎంకే యవజన విభాగం నాయకుడిగా, చేపాక్-ట్రిప్లికేన్ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి కల్పించాలంటూ మంత్రులంతా ఎప్పటి నుంచో స్టాలిన్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆయన చేత మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయనిధికి యువజన సంక్షేమ శాఖ కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఆ సందర్భంగా కొంతమంది మంత్రుల శాఖలు కూడా మారే అవకాశాలున్నాయి.