Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.