Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త 2020లో ముంబైలో రాజ్‌కుంద్ర పై పోర్నోగ్రఫీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరీ చేసింది. పోర్న్ కాంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు రాజ్‌కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాజ్‌కుంద్రాపై సుమారు మూడు నెలల పాటు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రాజ్‌కుంద్రాతో పాటు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, ఉమేశ్ కామత్‌లకు కూడా ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరీ చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది.