Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ ఈ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్‌ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందీప్‌కు పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి జాతీయ పార్టీగా అవతరించింది.