Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వరంగల్ జిల్లా పాపయ్యపేట చమన్ ప్రాంతానికి చెందిన రాచర్ల షాలిని ఆర్మూర్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ప్రశాంత్ హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన ఓ కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. జడ్జి షాలినికి పురుటి నొప్పులు రావడంతో హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి తీసుకెళ్ళారు.
సామాన్య మహిళ మాదిరిగా వచ్చిన ఆమెకు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిపించారు. సర్కార్ దవాఖానల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఇక్కడ డెలివరీ చేయించుకున్నట్టు సంతోషాన్ని వ్యక్తం చేశారు. షాలినికి దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి, డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్‌ను అందజేశారు.