Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీలోని సర్దాల్ పటేల్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రేపు ప్రారంభిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12.47 గంటలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తొలుత ఆయన పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించి, తన గదిలో కేసీఆర్ కూర్చుంటారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.