Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేరళలోని త్రిస్సూర్‌లో పదో తరగతి చదివే ఒక విద్యార్థి అంబులెన్స్‌ను దొంగిలించడమే కాకుండా ఆ వాహనాన్ని 8 కిలోమీటర్ల దూరం నడిపిన సంఘటన జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఆ విద్యార్థి లో ఫీవర్, రక్తం తక్కువ ఉండడంతో త్రిస్సూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు. డ్రైవర్ బిజో అంబులెన్స్ ఆస్పత్రి ముందు ఆపి, మంచి నీళ్ల తెచ్చుకునేందుకు కిందకు దిగాడు.
తాళం చెవులు బండికే ఉండడం ఈ పిల్లాడు గమనించగంతో వెంటనే అంబులెన్స్ ఎక్కి స్టార్ట్ చేసి ఒళ్లూర్ సిటీ రోడ్డు మీదుగా డ్రైవ్ చేస్తూ వెళ్లాడు. నీళ్లు తీసుకొని వచ్చి చూసే సరికి అంబులెన్స్ కనిపించలేదు. దాంతో అతను అంబులెన్సు మిస్సింగ్ గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జీపీఎస్ సాయంతో అంబులెన్స్‌ను వెంబడించాడు. ఆ పిల్లాడిని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక సిబ్బంది కుమారుడిగా పోలీసులు గుర్తించారు.