Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బండి సంజయ్ కి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని వ్యాఖ్యానించారు. బిజెపికి మహిళలని కించపరచడం అలవాటేనని.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రధాని మోడీ అవహేళన చేశారని, తనని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డీబండి సంజయ్ అవహేళన చేశారని విమర్శించారు.
అంతేకాక బతుకమ్మను కూడా అవమానించారని.. ఆయన వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయన్నారు. బెంగాల్ ఎన్నికలలో ప్రజలు బిజెపికి బుద్ధి చెప్పారని.. తెలంగాణ ఎన్నికలలో కూడా ప్రజలు బిజెపికి బుద్ధి చెబుతారని అన్నారు. ఇక వచ్చే ఎన్నికలలో సీఎం కేసీఆర్ తనని ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే చేస్తానని అన్నారు. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తారని. ఒకవేళ పోటీ చేయకపోతే అరవింద్ ఓటమి కోసం ప్రచారం చేస్తానని చెప్పారు.