Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యూనివర్సిటీ చట్టాల సవరణ బిల్లుకు ఇవాళ కేరళ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ ఛాన్సలర్ల పదవి నుంచి గవర్నర్‌ను తొలగిస్తూ ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారు. గవర్నర్ల స్థానంలో వర్సిటీ టాప్ పోస్టుకు అకాడమీషియన్లను నియమించాలని ఆ బిల్లులో తెలిపారు. బిల్లుపై ఓటింగ్ జరిగిన సమయంలో ప్రతిపక్ష యూడీఎఫ్ సభ నుంచి వాకౌట్ చేసింది. స్పీకర్ ఏఎన్ శంషీర్ బిల్లును పాస్ చేశారు. వర్సిటీ ఛాన్సలర్‌గా గవర్నర్ నియామకాన్ని తొలగిస్తూ చేసిన ప్రతిపాదనను అడ్డుకోవడం లేదని, కానీ ఆ పోస్టుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పేర్కొన్నది. ఇటీవల కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్, సీఎం విజయన్ ప్రభుత్వం మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.