Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత 17వ మహాసభలకు సంబంధించిన ప్రారంభ సభ ప్రారంభమైంది. ఈ సభ ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథులు గా జస్టీస్ చంద్రూ, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హజరయ్యారు. అంతకు ముందు హుస్సేన్ సాగర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, బాలికల జాతీయ కన్వీనర్ థీఫ్సీతాధర్ తదితరులు పాల్గొన్నారు.