Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవల ఏపీ వైద్యఆరోగ్య విభాగం జాతీయస్థాయిలో రెండు అవార్డులు కైవసం చేసుకుంది. టెలీ కన్సల్టేషన్ విభాగంలోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్ ల అంశంలోనూ ఏపీకి ఈ అవార్డులు దక్కాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు కేంద్రమంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ చేతల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి విడదల రజని, ఎం.టి.కృష్ణబాబు నేడు తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు లభించిన అవార్డులను ఆయనకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించారు. మున్ముందు కూడా ఇదే తరహా పనితీరు కనబర్చాలని సూచించారు.