Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జనసేన పార్టీ ఏపీలో కొత్త కార్యాచరణకు రూపకల్పన చేసింది. కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఊపుమీదున్న జనసేన తాజాగా 'యువ శక్తి' పేరిట ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి సభ జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని జనసేన వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే 'యువ శక్తి' సభలు నిర్వహిస్తున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పలు జిల్లాల్లో 'యువ శక్తి' సభలు జరుపుతామని వివరించారు.