Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌కు సంబంధించి వేలంలో పాల్గొనబోతున్న ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. మొత్తం 405 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటుండగా, ఈ నెల 23న కొచ్చిలో వేలం జరగనుంది. తొలుత 991 మంది ఆటగాళ్ల ప్రారంభ జాబితా నుంచి 10 జట్లు మొత్తంగా 369 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసుకున్నాయి. 405 మంది ఆటగాళ్లలో 273 మంది భారతీయులు కాగా, 132 మంది విదేశీ ఆటగాళ్లు. నలుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో 119 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా, 282 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు. వీరిలో నలుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు. మొత్తం 87 స్లాట్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో 30 వరకు విదేశీ ఆటగాళ్లకు రిజర్వు చేశారు. అత్యధిక రిజర్వు ధర 2 కోట్ల రూపాయలు. వేలంలో ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీల వద్ద ఇంకా మిగిలింది రూ. 206.5 కోట్లు కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద అత్యధికంగా రూ. 42.25 కోట్లు మిగిలి ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అతి తక్కువగా రూ. 7.05 కోట్లు మాత్రమే ఉంది.