Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: అప్పుల బాధతో ఓ రైతు, పంటకు తెగులు సోకిందని మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు వేర్వేరు ఘటనలు వరంగల్ జిల్లాలో మంగళవారం జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. గీసుగొండ మండలం ఊకల్ గ్రామానికి చెందిన రైతు ఉప్పుల మల్లయ్య(57) తనకు ఉన్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడు. రెండు మూడేళ్ల నుంచి పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 4న చేను వద్ద పురుగుల మందు తాగాడు. అలానే భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి (48) పెళ్లయ్యాక, అత్తగారి గ్రామమైన ఎలుకుర్తిహవేలికి వలస వచ్చాడు. రెండేళ్ల నుంచి రెండెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం మిర్చిపంట సాగు చేయగా తెగులు సోకింది. దీంతో పెట్టుబడి కూడా రాదనే ఆవేదనతో చేను వద్దనే పురుగుల మందు తాగి పడిపోయాడు. వీరిద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు మృతిచెందారు.