Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్నది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. జమ్ముకశ్మీర్‌లోని కశ్మీర్‌లో పూర్తికానున్నది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర పూర్తయ్యింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో యాత్ర కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం భడోటిలోని సవాయ్ మందిర్ నుంచి యాత్రను మొదలుపెట్టారు. ఇవాళ్టి యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి చాలా దూరం నడిచారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా విషయాల గురించి ముచ్చటించుకున్నారు.