Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ దూరంగా ఉన్నారు. నేడు ఆయన ఢిల్లీకి కూడా వెళ్లలేదు. నేడు హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని కేటీఆర్ ప్రకటించారు. ఉదయం 10:45కు బీఓఎస్సీహెచ్ ప్రధాన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. సుజుకి అంతర్జాతీయ విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించనున్నారు. రెండు కార్యక్రమాల కారణంగా కేసీఆర్ అనుమతితోనే ఢిల్లీ వెళ్ళడం లేదని కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత మాత్రం.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు.