Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రపంచకప్ ఫైనల్స్ మ్యాచే తన మాతృదేశం అర్జెంటీనా తరపున తాను ఆడబోయే చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు. క్రోయేషియాతో జరిగిన సెమీ ఫైనల్స్ లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ లో కూడా మెస్సీ గోల్ చేసి తన దేశ విజయంలో కీలక పాత్రను పోషించాడు. ఈ సందర్భంగా మీడియాతో మెస్సీ మాట్లాడుతూ... అర్జెంటీనా ఫైనల్స్ కు చేరడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఫైనల్స్ లో చివరి మ్యాచ్ ను ఆడటం ద్వారా తన ఫుట్ బాల్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నానని తెలిపాడు. మరో ప్రపంచకప్ కు చాలా సంవత్సరాలు పడుతుందని... అప్పటి వరకు తనలో ఇలాగే ఆడేంత సత్తా ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నాడు. తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ఇలా ముగించడమే బెస్ట్ అని చెప్పాడు.